సీఎం సిద్దు.. హైకమాండ్‌ జపం | - | Sakshi
Sakshi News home page

సీఎం సిద్దు.. హైకమాండ్‌ జపం

Feb 11 2026 7:52 AM | Updated on Feb 11 2026 7:52 AM

సీఎం సిద్దు.. హైకమాండ్‌ జపం

సీఎం సిద్దు.. హైకమాండ్‌ జపం

బనశంకరి: పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ఆవరణలో మాజీ సీఎం, దివంగత కెంగల్‌ హనుమంతయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించి సీఎం మాట్లాడారు. కెంగల్‌ హనుమంతయ్య రాష్ట్రంలో ప్రామాణిక ధీమంత రాజకీయనేత, అద్భుతమైన విధానసౌధను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కర్ణాటక ఏకీకరణకు పోరాడిన నేతగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సేవలందించారని చెప్పారు. రాజ్యాంగ రచనా కమిటీలో విలువైన సలహాలు అందించారన్నారు. ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలు అందరికీ మార్గదర్శనం చేస్తాయన్నారు. తనను పిలవలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్లడం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement