హంపీ బై స్కైకి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

హంపీ బై స్కైకి శ్రీకారం

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

హంపీ

హంపీ బై స్కైకి శ్రీకారం

హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం కమలాపుర భువనేశ్వరి హోటల్‌ మైదానంలో హంపీ బై స్కై కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ మహ్మద్‌ అక్రమ్‌ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన హంపీలో వెలసిన రాయల కాలం నాటి సుందరమైన స్మారకాలను, కట్టడాలను, ఆలయాలను ఆకాశంలో నుంచి వీక్షించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ఒక్కరికి రూ.3800 టిక్కెట్‌ ధర కల్పించామని, 5, 6 నిమిషాల పాటు హెలికాప్టర్‌ ద్వారా హంపీ అందాలను వీక్షించవచ్చని తెలిపారు. ఈనెల 12 నుంచి 16 వరకు హంపీ బై స్కై కార్యక్రమం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

భక్తిశ్రద్ధలతో తుంగా హారతి

హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా విరుపాక్షేశ్వర ఆలయం సమీపంలోని తుంగభద్ర నది స్నానఘాట్‌ వద్ద తుంగా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, డిప్యూటీ కమిషనర్‌, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు కాంస్య దీపాలను వెలిగించారు. నది నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతి, మంత్రాల జపం, పెద్ద పెట్టున శంఖం ఊదడంతో భక్తులు, పర్యాటకుల్లో భక్తిభావం ఉట్టిపడింది.

కొప్పళ సీఐ జయప్రకాష్‌ బదిలీ

రాయచూరు రూరల్‌: కొప్పళ టౌన్‌ సీఐ జయప్రకాష్‌ను కొప్పళ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్‌సింగ్‌ రాథోడ్‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న డి.సురేష్‌ను లోకాయుక్తకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధానిపై హేళన తగదు

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌లో దేశం పురోగమనం చెందుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ సమావేశంలో అవమాన పరిచే విధంగా మహిళా సభ్యురాలిని ప్రశ్నించడం సబబు కాదని బీజేపీ మహిళా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు సుమతి శాస్త్రి మాట్లాడారు. అసభ్య పద జాలాన్ని వాడకుండా కట్టడి చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సుమా గీస్తీ, శారద, సావిత్రి, రూప, లక్ష్మి, అశ్విని, గోవిందులున్నారు.

ఘనంగా వసంత వైభవం

హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం నగరంలో వసంత వైభవాన్ని ఘనంగా నెరవేర్చారు. వివిధ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. వసంత వైభవం ఊరేగింపును నగరంలోని వడకరాయ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా చేపట్టి పునీత్‌ సర్కిల్‌ వరకు నిర్వహించారు.

హంపీ బై స్కైకి శ్రీకారం1
1/4

హంపీ బై స్కైకి శ్రీకారం

హంపీ బై స్కైకి శ్రీకారం2
2/4

హంపీ బై స్కైకి శ్రీకారం

హంపీ బై స్కైకి శ్రీకారం3
3/4

హంపీ బై స్కైకి శ్రీకారం

హంపీ బై స్కైకి శ్రీకారం4
4/4

హంపీ బై స్కైకి శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement