సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం

కోలారు: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు నిబద్ధతతో విధులు నిర్వహించి విద్యాశాఖకు మంచి పేరు తీసుకు రావాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జీ.సురేష్‌ బాబు సూచించారు. గురువారం నగరంలోని కేఈబీ సముదాయ భవనంలో 70 మంది ఉపాధ్యాయులకు సావిత్రిబాయి పూలే అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని స్థానాల కంటే ఉపాధ్యాయ వృత్తికి ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధ్యాయ గెళెయర బళగ అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఈ మధ్య బాల్య వివాహాలు అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. చదువుకునే వయస్సులో పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చదివే పిల్లలను బడికి పంపి వారిని ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహాల విషయంలో పోషకులు, ఉపాధ్యాయులు జాగృతులై ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement