అబ్కారీశాఖలో అవినీతి పొంగు
● మంత్రి తిమ్మాపుర తప్పుకోవాలి
● విధానసభలో ప్రతిపక్షాల పట్టు
శివాజీనగర: ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ పేరుతో సిద్దరామయ్య సర్కారు ఈ అసెంబ్లీ సమావేశాలను జరుపుతుండగా చివరకు ఆ అంశం మీద తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, గతంలో అమల్లో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని ప్రకటించింది. మంగళవారం విధానసభలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టి, గ్రామీణ పేదల పాలిట సంజీవనిగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని ఈ సభ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వీబీ జీ రామ్‌జీ చట్టం సమాఖ్య వ్యవస్థ ఆశయాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
ఇంత ఖర్చును ఎలా భరించాలి
జీ రామ్‌జీలో రాష్ట్రాలు ఏకాఎకి 40 శాతం నిధులను భరించాలని నియమం ఉంది, దీంతో 125 రోజుల పని కల్పిస్తామని కొత్త చట్టంలో చెప్పినా కూడా, వాస్తవంగా 50 రోజుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది సమాఖ్య నియమాలకు విరుద్ధం అని సిద్దరామయ్య ఆరోపించారు. దేశంలో కర్ణాటక అత్యధికంగా పన్ను చెల్లించే రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలు అత్యధిక పన్నుల సేకరణలో దేశంలో తొలి స్థానంలో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకకు ఆర్థిక సంఘాల నిధుల్లో ఏటేటా అతి తక్కువగా కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త చట్టం ద్వారా రాష్ట్రంపై భారం వేస్తోంది, రాష్ట్ర ఆర్థిక భద్రతను, అభివృద్దిని ప్రమాదానికి గురిచేసే కుట్ర అని ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ తీర్మానమని, అసెంబ్లీ నిర్ణయం కాదని నినాదాలు చేశారు.
మంగళవారం విధానసభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవేశంగా మాట్లాడుతున్న సీఎం సిద్దరామయ్య
ప్రధానినే అలా అంటారా?
పరిషత్‌లో ప్రతిపక్షాల రభస
మెట్టు దిగిన ఎమ్మెల్సీ నజీర్
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి దేశద్రోహి అని నిందించడం గురించి విధానపరిషత్‌లో రభస కొనసాగింది. ఈ మాటలు అన్న కాంగ్రెస్ సభ్యుడు నజీర్ అహమ్మద్ క్షమాపణ చెప్పాలని బీజేపీ, జేడీఎస్ పట్టుబట్టాయి. దీంతో నజీర్ అహమ్మద్ తన వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల గురించి సోమవారం రాత్రి నుంచి ఎగువసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం పోడియం వద్దకు వచ్చి ధర్నా కొనసాగించారు. నజీర్ అహమ్మద్‌తో క్షమాపణ చెప్పించండి, లేకపోతే బయటికి పంపాలని డిమాండ్ చేశారు. సభాపతి బసవరాజ్ హొరట్టి స్పందిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైన పదాలను ఉపయోగించడం అపరాధమని, అందరిదీ ఇదే అభిప్రాయమని చెప్పారు. దేశ ప్రధాని గురించి ఇలాంటి మాటలను మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, ముందు వారు క్షమాపణ చెప్పాలి, ఆ తరువాత ఆలోచిస్తానని నజీర్ అహమ్మద్ తెలిపారు. దీనికి ఒప్పుకోని ప్రతిపక్ష సభ్యులు ఒకే వాక్యంలో క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. నజీర్‌కు పాకిస్తాన్ నాలుక ఉండాలి, అందుకే ఇలా మాట్లాడారు అని విమర్శించిన సీటీ రవి క్షమాపణ చెప్పాలని నజీర్ కోరారు. ఇందుకు రవి విచారం వ్యక్తంచేయగా, ఆ తరువాత నజీర్ కూడా తన వ్యాఖ్యలపై విచారం వెలిబుచ్చారు. అయినా కొంతసేపు రచ్చ కొనసాగింది.
సమాఖ్య స్ఫూర్తికి జీ రామ్‌జీ విరుద్ధం
రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు
అసెంబ్లీలో సిద్దు సర్కారు తీర్మానం
శివాజీనగర: ఎకై ్సజ్ శాఖలో అవినీతి పొంగిపొర్లుతోందని మంగళవారం విధానసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఆరోప–ప్రత్యారోపణలు జరిగాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేశాయి. ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగింది, అందులో మంత్రి ప్రమేయముంది. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని కోరాయి. మొదట సభ ఆరంభం కాగానే ఆర్.అశోక్ ఎకై ్సజ్ శాఖలో అధికారులు, మంత్రి కలసి అవినీతికి పాల్పడుతున్నారని పలు ఆధారాలను ప్రదర్శించి, లంచానికి డిమాండ్ పెట్టిన అధికారుల ఆడియోను వినిపించారు. దీనికంటే సాక్ష్యం ఇంక అవసరం లేదు. తక్షణమే ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. లోకాయుక్తకు చిక్కిన ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగరాజు మంత్రి పేరును ప్రస్తావించారని చెప్పారు. అంతేకాకుండా ఆ శాఖ అధికారులు కులాల పేరుతో పనులు చక్కబెట్టేందుకు దిగారు, కుల సంఘం నాయకులతో కలిసి సీఎం సిద్దరామయ్యను కలిస్తే పనైపోతుందని ఓ కాంట్రాక్టర్‌కు అధికారి చెప్పిన ఆడియోను వినిపించారు. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్రను భేటీ చేసి, అక్కడి నుంచి ఫోన్ చేయించాలని కూడా సలహా ఇచ్చారన్నారు. ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు.
ముందే చర్చ
వీబీ జీ రామ్‌జీ చట్టంపై ముందుగా చర్చ జరగాల్సింది, అయినా కూడా ప్రతిపక్షాల డిమాండ్ మేరకు స్పీకర్ ఖాదర్ ఎకై ్సజ్ శాఖ ఆరోపణలపై చర్చకు అవకాశం కల్పించారు. ఈ గొడవ వల్ల సుమారు గంటన్నర సభ ఆలస్యంగా మొదలైంది.
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
అబ్కారీశాఖలో అవినీతి పొంగు


