కనకపుర వద్ద భారీ గజ మంద | - | Sakshi
Sakshi News home page

కనకపుర వద్ద భారీ గజ మంద

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

కనకపు

కనకపుర వద్ద భారీ గజ మంద

గజదాడిలో అన్నదాత మృతి

దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో కనకపురలో అడవి ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. తాలూకాలోని కాడుశివనహళ్లి గ్రామం చుట్టుపక్కల సంచరిస్తూ పంటలు తొక్కేస్తూ, చెట్లు విరిచేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అడవుల నుంచి బన్నేరుఘట్ట అరణ్యంలోకి వచ్చిన ఏనుగులు శనివారం సాయంత్రం నుంచి కాడుశివనహళ్లి పరిసరాల్లో మకాం వేశాయి. ఆదివారం అటవీ సిబ్బంది ఏనుగులను కాస్త దూరంగా తరిమేశారు. పరిసరాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మైసూరు: చామరాజనగర జిల్లాలో తమిళనాడును ఆనుకుని ఉండే కరల్వాడి గ్రామ శివార్లలో పొలంలో ఉన్న రైతుపై 9 అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. రైతు మహేష్‌ (26) పొలాన్ని కాపలా కాస్తున్నాడు. ఈ సమయంలో ఏనుగులు అతనిని చుట్టుముట్టి తొండంతో కొట్టి కాళ్లతో తొక్కాయి. గ్రామస్తులు ఎంత అరిచినా, ఏనుగుల గుంపు వదల్లేదు. ఏనుగులు వెళ్లిపోయాక చూస్తే రైతు చనిపోయి ఉన్నాడు. గత మూడు, నాలుగు నెలలుగా అడవి ఏనుగులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్లు జనం తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ధర్నా చేశారు. ఏనుగుల నుంచి కాపాడాలని డిమాండ్‌ చేశారు. సత్యమంగళ అభయారణ్యం అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

కనకపుర వద్ద భారీ గజ మంద1
1/1

కనకపుర వద్ద భారీ గజ మంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement