జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు | - | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

జ్యోత

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు

యశవంతపుర: జ్యోతిషునితో మహిళ ఆక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురలో ఈ సంఘటన జరిగింది. శివమొగ్గకు చెందిన జోతిష్యుడు కమలాకర భట్‌ గురూజీ, అతని ప్రియురాలు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గురూజీ వద్ద సుచిత్ర అనే మహిళ పనిచేస్తూ ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. సిద్ధాపుర తాలూకా అవరగుప్పవాసి మహేశ్‌ నాయక్‌ భార్య ఈమె. సుచిత్ర ఇద్దరు కూతుళ్లతో కలిసి శివమొగ్గలోనే గురూజీ వద్ద ఉంటోంది. తల్లి తీరు నచ్చక ఓ కూతురు సిద్ధాపురలోని తమ గ్రామానికి వెళ్లి తండ్రి మహేశ్‌ నాయక, చిన్నాన్న వసంత నాయక (41)కు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం కూతురిని వెతుక్కుంటూ సుచిత్ర కారులో కొందరు యువకులను తీసుకుని వచ్చింది. ఈ సమయంలో సుచిత్రా, భర్త మహేశ్‌ల మధ్య వాదులాట జరిగింది. ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. మహేశ్‌, వసంత్‌ నాయక, కుమార్‌ని సుచిత్ర అనుచరులు కత్తితో పొడిచారు. గాయాలైన వసంత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. మిగతా ఇద్దరూ శివమొగ్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో గురూజీ, సుచిత్ర, ఐదుమంది యువకులపై సిద్ధాపుర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఘటనా స్థలిని ఎస్పీ దీపన్‌ పరిశీలించారు.

వీరి ముఠా చేతిలో ఒకరి హత్య

ఉత్తర కన్నడ జిల్లాలో ఘటన

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు 1
1/2

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు 2
2/2

జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement