బెంగళూరులో కుంగిన రోడ్డు | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కుంగిన రోడ్డు

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

బెంగళూరులో కుంగిన రోడ్డు

బెంగళూరులో కుంగిన రోడ్డు

సాక్షి బెంగళూరు: బెంగళూరు ప్రధాన రహదారుల్లో ఒకటైన బెంగళూరు–హోసూరు జాతీయ రహదారిలో నేల కుంగిపోయింది. ఆ ప్రదేశంలో వాహనాలు లేకపోవడంతో ప్రాణహాని తప్పింది, అయితే ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బుధవారం రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా పాత చందాపుర వద్ద సుమారు 20 అడుగుల లోతుకు భూమి కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయపడిపోయారు. చందాపుర నుంచి తమిళనాడు సరిహద్దు అత్తిబెలె వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పాత చందాపుర వద్ద హైవే అథారిటీ ద్వారా అండర్‌ పాస్‌ పనులు జరుగుతున్నాయి. సమీప కాలనీల నుంచి వస్తున్న మురుగునీరు అడుగు భాగంలోకి వచ్చి చేరడంతో మట్టి మెత్తబడి ఇలా జరిగిందని చెబుతున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కారణమని వాహనదారులు ఆరోపించారు.

భారీగా ట్రాఫిక్‌ జాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement