పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా

పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా

శివమొగ్గ: నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి రూ.61 లక్షలను పోగొట్టుకున్నాడు. వివరాలు.. బాధితుడు ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఎల్‌ఎఫ్‌ వర్క్‌ కంపెనీ అనే ప్రకటన వచ్చింది. అందులో బంగారు, షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఆ ప్రలోభానికి లొంగిన బాధితుడు వంచకులు ఇచ్చిన లింక్‌ ద్వారా ఓ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. వెంటనే అతడు ఎల్‌జీ (ఎల్‌ఎఫ్‌– వర్క్‌) 4988 అఫిషియల్‌ గ్రూప్‌ అనే వాట్సప్‌ గ్రూప్‌లోకి జతయ్యాడు. యాప్‌లో అడిగిన పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలను భర్తీ చేసిన తర్వాత వంచకులు అతనికి పలు యూపీఐ ఐడీలను ఇచ్చి నగదు బదిలీ చేయాలని కోరారు. అలా దశల వారీగా రూ.61 లక్షలను బాధితుడి వద్ద నుంచి బదిలీ చేయించుకుని బ్లాక్‌ చేయడంతో మోసపోయానని శివమొగ్గ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

మహిళలకు రూ.12.80 లక్షల వంచన

మైసూరు: దుస్తుల డిజైనింగ్‌లో శిక్షణ ఇస్తామని ప్రలోభపెట్టి 8 మంది మహిళలకు రూ.12.80 లక్షలు టోపీ వేశారు. కువెంపునగర పరిధిలోని దేవాంశ్‌ బోటిక్‌, రెంటల్‌ సంస్థ యజమాని సునందమాల, బాలబొమ్మలపై కేసు నమోదైంది. వీరిద్దరూ కలిసి నవ్య, జ్యోతి, రక్షిత, శ్యామల, శృతి, మల్లేశ్వరి, ఉషా అనేవారిని మోసగించారు. డిజైనింగ్‌ బోటిక్‌ శిక్షణ ఇస్తామని రూ.12.80 లక్షలను వసూలు చేసి ముఖం చాటేశారు. ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, డబ్బు ఇప్పించాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శివమొగ్గలో సైబర్‌ నేరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement