పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్‌రైస్‌ అమ్ముకోవడం మేలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్‌రైస్‌ అమ్ముకోవడం మేలు

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్‌రైస్‌ అమ్ముకోవడం మేలు

పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్‌రైస్‌ అమ్ముకోవడం మేలు

రాయచూరు రూరల్‌: ఒక్కరోజు కూడా సెలవు దొరకదు, ఈ ఉద్యోగం చేయడం కంటే ఎక్కడైనా ఎగ్‌రైస్‌ బండి పెట్టుకొని బతకడం మంచిది.. అని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడో పోలీసు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు కారణమైంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలుకా హనుమ సాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ బ్రహ్మానంద వ్యవహారం చర్చ రేకెత్తిస్తోంది. పోలీసుగా సంవత్సరంలో 365 రోజూ పనిచేయాలి. సెలవు అనేదే ఉండదు, తీవ్రమైన పని ఒత్తిడి.. అని స్టేటస్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్టేటస్‌ను చూసిన కొందరు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో మంగళవారం నుంచి వైరల్‌ అయ్యింది. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బ్రహ్మానందపై గరం అయ్యారు.

డీజీపీ ప్రకటనను ప్రస్తావిస్తూ..

బ్రహ్మానంద అంతటితో ఊరుకోలేదు. త్వరలో రాష్ట్రంలో 8,300 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ చేస్తామని డీజీపీ ఎంఏ సలీం చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించాడు. యువతీ యువకుల్లారా.. పోలీసైతే మీ బతుకూ ఇంతేనన్నట్లు స్పందించాడు. వీలైతే మరో ఉద్యోగం చూసుకోండి అని సలహా ఇచ్చాడు.

అతనితో మాట్లాడా: జిల్లా ఎస్పీ

ఈ నేపథ్యంలో బ్రహ్మానందపై జిల్లా ఎస్పీ ఎల్‌.రాం అరసిద్ది విచారణకు ఆదేశించారు. నేను అతనితో మాట్లాడాను, ఉద్యోగంలో ఉంటూ ఇటువంటి పోస్టులు పెట్టరాదని తెలిపాను, అతనిని వేధించారా?, ఒత్తిళ్లకు గురిచేశారా? అని అక్కడి ఎస్‌ఐను కూడా ప్రశ్నించానని ఎస్పీ తెలిపారు.

365 రోజులూ చాకిరీ చేయాలి

కొప్పళ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement