హంపీ ఉత్సవాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

హంపీ

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హొసపేటె: ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను విజయనగర జిల్లా అధికారి కవితా ఎస్‌.మన్నికేరి కోరారు. బెంగళూరులో డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు క్యాబినేట్‌ మంత్రులు హెచ్‌కే పాటిల్‌, శివరాజ్‌ తంగడిగి, జమీర్‌ అహమ్మద్‌తో పాటు తదితర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

బళ్లారి అర్బన్‌: బళ్లారి మహానగర పాలక సంస్థ పరిధిలోని 8వ వార్డులో ఉన్న శ్రీరామ ఆలయ అభివృద్ధి పనులు, అంగనవాడీ కేంద్రాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రామాంజనేయులు, కాంగ్రెస్‌ నాయకులు డి.సూరి పరశురాముడు, థియేటర్‌ శివు, స్థానిక నాయకులు, వెంకటేశులు, ఆంజనేయులు, ఫకీరప్ప, జికే.స్వామి, కేశవులు సనత కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ విఫలం:

యువతి ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: ప్రేమ విఫలమైందనే కారణంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాన్వి తాలుకా నీరమాన్వి మండలం సీకల్‌ తండాకు చెందిన సుమంగళ (21) సింధనూరులో డిగ్రీ చదువుతోంది. సింధనూరులో హాస్టల్‌ ఉంటూ ఇంటికి రాకపోకలు సాగించేంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సింధనూరు–బెంగళూరు రైలు మార్గంలో పట్టాలపై సుమంగళ మృతదేహం లభించింది. ప్రేమ విఫలం కావడంతో సుమంగళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రేమికుడు మోసం చేయడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుమంగళ ఒక ఆడియో మెసేజ్‌ను సోదరుడికి పంపినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ తెలిపారు.

ఘనంగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవం

బళ్లారి టౌన్‌: నగరంలోని విద్యానగర్‌లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సేవ ట్రస్ట్‌ అధ్యక్షుడు వై.భాస్కర్‌, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్దన్‌, పదాధికారులు కొండయ్య, ముత్యాల రాజు, కరణం గాలయ్య, రవిచంద్ర, శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మీదేవి, మల్లికార్జున, మోహన్‌దాస్‌, బసవరాజ్‌ స్వామి, సీతారామాంజనేయలు, సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

శరవేగంగా కొత్త గేట్ల ఏర్పాటు

హొసపేటె: తుంగభద్ర జలాశయానికి సంబంధించి కొత్త గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ 10 క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 18వ గేటుఏర్పాటు చేసి 20 రోజులు అయ్యింది. ప్రస్తుతం 1, 4, 11, 17, 19, 20, 24, 27, 28, 33 గేట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. గదగ్‌, టీబీ డ్యాం తుంగభద్ర ఎస్టేట్‌ కార్యాలయ ఆవరణంలో గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 21 గేట్ల నిర్మాణం పూర్తయింది. రెండు గేట్ల నిర్మాణం పురోగతిలో ఉంది. మరో నాలుగు గేట్ల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి గదగ్‌కు చేరుకుందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం 1
1/4

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం 2
2/4

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం 3
3/4

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం 4
4/4

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement