కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలో కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలని అఖిల మహర్షి వాల్మీకి నాయక్ సంఘటన సంచాలకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ, రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పలు రకాలైన జాతరలు, రథోత్సవాల సమయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కేఎస్‌ఆర్‌పీ 13వ పోలీస్ బెటాలియన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని శాసన సభ్యులు అభివృద్ధి విషయంలో ఏకం కావాలన్నారు. బెంగళూరు, తుమకూరు ప్రతినిధుల మాదిరిగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు.


