సొంతదారులకు చోరీ సొత్తు అప్పగింత
యశవంతపుర: మల్లేశ్వరం, రాజాజీనగర, సుబ్రమణ్యనగర, మహాలక్ష్మి, యశవంతపుర, ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసుస్టేష్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు కార్యచరణ చేసి 75 కేసుల్లో 83 మంది నించితులను అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.1.76 కోట్ల విలువైన 67 ముబైల్‌ఫోన్లు, మూడు లక్షల నగదు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మల్లేశ్వరం పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న జీబీఏ అట మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చోరీ సొత్తును సొంతదారులకు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ అప్పగించారు.


