ద్వేషపూరిత రాజకీయాలు తగదు
హొసపేటె: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సరికాదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలో ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు అసెంబ్లీలో గవర్నర్ పట్ల అధికార పార్టీ చూపిన అగౌరవం ఖండనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను బెదిరించే మార్గంలో పయనిస్తోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ చట్టం(ఎన్‌ఆర్‌ఈజీఏ)లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి వీబీజీ రామ్ జీ పేరును జోడించడం ద్వారా మార్పులు చేశారన్నారు. కానీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి అపప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే, సంకీర్ణ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటే, ఆ పార్టీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు జీవరత్నం, బీజేపీ నేతలు బంగారు లక్ష్మణ్, అశోక్ జీర్, శంకర్ మేటి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి


