కార్మిక చట్టాలు విరమించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

కార్మ

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట సంచాలకుడు మీనాక్షి సుందరం డిమాండ్‌ చేిశారు. మంగళవారం లింగసూగూరు తాలూకా హట్టి సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్‌ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్ట పోతారని ఆరోపించారు. ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత మిషన్‌ రోజ్‌గార్‌ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్‌ అంధకారమైందన్నారు. సమావేశంలో రాఘవేంద్ర కుష్టిగి, మహ్మద్‌ అమీర్‌, సంగయ్య స్వామి, షఫీ, మహంతేష్‌, నరసణ్ణ, జమదగ్ని, గిరియప్ప, గుండప్ప, సోమన్న, వెంకటేష్‌, బసవరాజ్‌లున్నారు.

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోలారు: తాలూకాలోని వక్కలేరి ఫిర్కా ముదువత్తి గ్రామంలో మంగళవారం జరిగిన అశ్వర్థ కట్ట ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌, ఎమ్మెల్సీ ఎంఎల్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో మానసిక సంతృప్తిని కలుగజేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుండడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ఒక్కలిగుల సంఘం మాజీ డైరెక్టర్‌ రాము పాల్గొన్నారు.

నగరసభ అధికారిపై దాడి

కోలారు: నగరసభ అధికారిపై దుకాణ యజమాని దాడి చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్లాస్టిక్‌ నిషేధానికి సంబంధించి నగరసభ అధికారులు మంగళవారం కేఎస్‌ ఆర్టీసీ బస్టాండులోని శ్రీనివాస బేకరీలో తనిఖీలు చేయగా ప్లాస్టిక్‌ కవర్లు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో యజమాని గోవింద నగరసభ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌పై దాడి చేశాడు. ప్లాస్టిక్‌ కవర్లను లాక్కున్నాడు. ఘటనపై హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ నగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పాఠశాలకు డెస్కుల వితరణ

కోలారు : ఎయిర్‌బ్యాక్‌ కంపెనీ దాతృత్వం చాటింది. అరాభికొత్తనూరు పాఠశాలకు రూ.1.80 లక్షల విలువ చేసే డెస్కులను మంగళవారం విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధి మోనిష్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పశు ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్‌ నితిన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాహేరా నుస్రత్‌ పాల్గొన్నారు.

కరెంటు స్తంభాన్ని ఢీకొన్న పోలీసు జీపు

శ్రీనివాసపురం: పోలీస్‌ వాహనం ఢీకొని విద్యుత్‌ స్తంభం కూలి మహిళ గాయపడింది. కోలారు నుంచి శ్రీనివాసపురం వస్తున్న పోలీసు జీపు ఎంజీ రోడ్డులో అదుపు తప్పి డివైడర్‌ పైకెక్కి స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం కూలి అదే రోడ్డులో బైక్‌పై వెళ్తున్న మహిళపై పడింది. తలకు గాయాలు కావడంతో ఆమెను కోలారు ఆస్పత్రికి తరలించారు.

ఆస్తి వివాదం.. వ్యక్తిపై దాయాదుల దాడి

దొడ్డబళ్లాపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో వ్యక్తిపై దాయాదులు దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన దేవనహళ్లి తాలూకా రామనాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదన్‌(35)అనే వ్యక్తికి బంధువులతో భూ వివాదం ఉంది. కోర్టు విచారణలో ఆ భూమి మదన్‌కు చెందినది అంటూ తీర్పు వచ్చింది. కోట్ల విలువ చేసే భూమి చేజారిపోవడంతో మదన్‌ చిన్నాన్న కెంపన్న, పిన్ని అక్కయ్యమ్మ, వారి పిల్లలు బాబు, పునీత్‌లు సోమవారం రాత్రి మదన్‌ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. మదన్‌ తప్పించుకుని పారిపోయి విశ్వనాథపుర పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కు పంపించారని మదన్‌ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మదన్‌ దొడ్డబళ్లాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కార్మిక చట్టాలు   విరమించుకోవాలి1
1/4

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

కార్మిక చట్టాలు   విరమించుకోవాలి2
2/4

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

కార్మిక చట్టాలు   విరమించుకోవాలి3
3/4

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

కార్మిక చట్టాలు   విరమించుకోవాలి4
4/4

కార్మిక చట్టాలు విరమించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement