ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

ఇంజనీ

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు

బనశంకరి: అవినీతికి పాల్పడుతూ రూ.కోట్లు కూడట్టిన అధికారులపై లోకాయుక్త దాడులు జరిపింది. బెంగళూరు, శివమొగ్గ, ధారవాడ, దావణగెరెలో గురువారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.

ఎవరెవరు?

బెంగళూరు గ్రామాంతర కర్ణాటక రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్‌టిట్యూషన్‌ సొసైటీ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ హెచ్‌ఎం జనార్దన్‌, ప్రజాపనుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ పురుషోత్తమదాస్‌ హెగ్డే, దావణగెరె బెస్కాం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఆర్‌హెచ్‌ అర్జున్‌, ధార్వాడ సర్వేయర్‌ సోమలింగప్పల ఇళ్లు, ఆఫీసులు, సన్నిహితుల ఇళ్లలో గాలింపు జరుగుతోంది.

భారీగా నగదు, ఫాంహౌస్‌లు

●ఇంజనీరు హెచ్‌ఎం.జనార్దన్‌ ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు దొరికింది. పెద్దమొత్తంలో అక్రమ ఆస్తుల పత్రాలు లభించాయి. ఈయనకు సంబంధించి మైసూరులో 5 చోట్ల, బెంగళూరులో 6 చోట్ల తనిఖీ జరుగుతోంది.

● దావణగెరెలో బెస్కాం ఇంజనీర్‌ ఆర్‌హెచ్‌.అర్జున్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఇళ్లో భారీగా ఆస్తుల పత్రాలు, బంగారం లభించాయి. సాగర ఆనందపుర సమీపంలో తళలు గ్రామంలో అర్జున్‌ కు చెందిన 2.5 ఎకరాలు, 4.5 ఎకరాల విస్తీర్ణంలోని విలాసవంత ఫాంహౌస్‌లను గుర్తించి దాడులు చేశారు.

●సర్వేయరు సోమలింగప్ప సిద్దనగౌడర్‌ ధార్వాడలోని మురగోడ్‌ నివాసం, భారతినగర నివాసం, ఏడీఎల్‌ఆర్‌ ఆఫీసులో గాలింపు జరిపారు.

నలుగురు అధికారులపై లోకాయుక్త దాడులు

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు1
1/2

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు2
2/2

ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement