దేశంలోనే ఎక్కువ చార్జీలు
బనశంకరి: మెట్రో ప్రయాణికులకు కొంచెం ఉపశమనం. సోమవారం నుంచి అమల్లోకి రానున్న బెంగళూరు నమ్మమెట్రో రైలు టికెట్ రేట్ల పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఊరట దక్కింది. దీంతో ప్రయాణికులకు కాస్త సొమ్ము ఆదా అవుతుంది.
తెరవెనుక ఏం జరిగిందీ?
ఇటీవల 5 శాతం మెట్రో టికెట్ చార్జీలను పెంచడంపై అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇందుకు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలా, వద్దా?, ఇదేమి బాదుడు అని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెంపును కేంద్రం నిలుపుదల చేసినట్లు బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య తెలిపారు. టికెట్ చార్జీల పెంపుపై ఎంపీ తేజస్వి కొందరు కేంద్ర మంత్రులకు పరిస్థితిని వివరించారు. కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మాట్లాడారు. దీంతో 9వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న మెట్రో కొత్త టికెట్ రేట్లను నిలిపివేయాలని కేంద్రమంత్రి ఆదేశించారని ఎంపీ చెప్పారు.
ఇప్పటికే అధిక రేట్లని కేంద్రానికి విజ్ఞప్తులు
పెండింగ్‌లో పెట్టిన కేంద్రం
దేశంలోని మెట్రో రైలు వ్యవస్థల్లో బెంగళూరు మెట్రో అత్యధిక చార్జీలను కలిగి ఉంది, చార్జీల పెంపు అసంబద్ధంగా ఉందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని, మెట్రో టికెట్ ధరల పెంపుతో లక్షలాది మంది ప్రజలకు భారమవుతుంది, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించడం కష్టతరమౌతుంది అని వినతిపత్రాలు ఇచ్చినట్లు ఎంపీ తేజస్వి చెప్పారు. దీంతో కేంద్రమంత్రి ఖట్టర్ చార్జీల పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బెంగళూరు మెట్రో ఉన్నతాధికారులు మాట్లాడుతూ మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అందలేదని అన్నారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ.మోహన్ మాట్లాడుతూ నగర ఎంపీలు కేంద్ర మంత్రితో మాట్లాడామని, దీంతో పెంపు నిర్ణయం నిలిపివేతకు ఆదేశించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచాలని ఎక్కడా చెప్పలేదన్నారు. శనివారం రాత్రికి చార్జీల పెంపును పెండింగ్‌లో పెట్టినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలోనే ఎక్కువ చార్జీలు
దేశంలోనే ఎక్కువ చార్జీలు
దేశంలోనే ఎక్కువ చార్జీలు


