రథోత్సవం.. తరించిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

రథోత్సవం.. తరించిన భక్తజనం

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

రథోత్

రథోత్సవం.. తరించిన భక్తజనం

వైభవంగా బసవలింగ జాతర

సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు రావడంతో బళ్లారి తాలూకా మోకా గ్రామం భక్తజన సంద్రంగా మారింది. స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనల అనంతరం కల్యాణం జరిపించారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరులు మోకా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రథానికి పూజలు చేసి భక్తులతో కలసి లాగారు. అలాగే గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, పలువురు కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు రథోత్సవాన్ని తిలకించి, ఆలయంలో పూజలు చేయించారు. మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదురు బసవణ్ణ ఆలయం వరకూ రథాన్ని లాగారు. మోకా గ్రామం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దున ఉండటంతో ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మోకా గ్రామం భక్తులతో కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చిన అశేష జనవాహిని

బసవలింగ జాతరలో పాల్గొన్న భక్తులు

ఘనంగా

మోకా మల్లేశ్వర స్వామి జాతర

హాజరైన వేలాది మంది భక్తులు

రాయచూరు రూరల్‌: లింగసూగురు తాలూకా పికళిహళ్‌లో ఉటకనూరు మరి బసవలింగ శివయోగి దేశికేంద్ర మహస్వాముల 32వ జాతర వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు రాయచూరు, లింగసూగురు, సింధనూరు, మాన్వి, బళ్లారి నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

రథోత్సవం.. తరించిన భక్తజనం1
1/3

రథోత్సవం.. తరించిన భక్తజనం

రథోత్సవం.. తరించిన భక్తజనం2
2/3

రథోత్సవం.. తరించిన భక్తజనం

రథోత్సవం.. తరించిన భక్తజనం3
3/3

రథోత్సవం.. తరించిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement