పనుల్లో వేగం పెంచాలి
రాయచూరు రూరల్: రాయచూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పరిశ్రమల మౌలిక సౌకర్యాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు నంజయ్యన మఠ్ ఆదేశించారు. శుక్రవారం విమానాశ్రయం వద్ద జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 321 ఎకరాల్లో జరగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరిగతిన రక్షణ గోడల నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. రన్‌వే 1.7 కి.మీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 800 మీటర్ల పనులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉప కేంద్రం, భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాలు, ఆరు టవర్ల నిర్మాణం ఇతర పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు మహేష్, ప్రవీణ్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు
రాయచూరు రూరల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వాల్కట్ మైదానంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం, శివ లింగాల యాత్ర చేపడుతామన్నారు. 14న శాంతియాత్ర, 15న సాంస్కృతిక మహోత్సవం, 16న గౌరవ సమర్పణ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. 14వ తేదీన 12 కార్లపై శివలింగాలను కొలువుదీర్చి యాత్ర జరుపుతామన్నారు. భక్తులు సందర్శించుకునేందుకు వీలుగా వాల్కట్ మైదానంలో 40 అడుగుల శివలింగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో శారద, దానమ్మ, రేఖ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హుబ్లీ: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటిని సైట్లుగా మార్చి అందజేస్తామని మంత్రి సతీష్ జారకిహొళి తెలిపారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. మార్చి 6న సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రతిపాదిస్తారన్నారు. ఈసారి బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయన్నారు.
పనుల్లో వేగం పెంచాలి


