ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

ప్రజా

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

హొసపేటె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె నేపథ్యంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ముందు భాగంలో గురువారం సీఐటీయూ కార్యకర్తలు నిరసన తెలిపారు. సీఐటీయు, ప్రాంత రైతు సంఘ నాయకులు, అంగన్‌వాడీ, బీసీఎస్‌ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు, ఎల్‌ఐసీ తదితరులతో సహా వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

విద్యుత్‌ కేంద్రాల

ప్రైవేటీకరణ తగదు

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ప్రైవేటీకరణ చేయడం తగదని జెస్కాం ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. గురువారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు గోపి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విద్యుత్‌ బిల్లు–2026ను ప్రవేశ పెడితే ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారన్నారు. అలాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ సమష్టిగా ఆందోళన చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.

వేడుకగా సవారమ్మ జాతర

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా మమదాపురలో వెలసిన సవారమ్మ జాతర వేడుకగా జరిగింది. బుధవారం కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద కలశారోహణం చేశారు. కలశ కుంభాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మహేష్‌, రమేష్‌, శివు యాదవ్‌, అప్పనగౌడ, సవారప్ప, శేఖర్‌రెడ్డి, లక్ష్మిపతిలున్నారు.

ఆల్మట్టికి విశిష్ట అతిథుల రాక

ఆహారం కోసం విదేశాల నుంచి

తరలి వచ్చిన వలస పక్షులు

రాయచూరు రూరల్‌: ఆల్మట్టి డ్యాం పోటు జలాల్లో విదేశీ వలస పక్షుల సందడి నెలకొంది. ఆహారం కోసం విదేశాల నుంచి ఈ వలస పక్షులు తరలి వచ్చాయి. రంగు రంగుల పక్షుల సందడి చూపరుల మది దోస్తోంది. పొడవైన కాళ్లు, గొంతు, వెడల్పైన రెక్కలతో నడిచే పక్షులను గ్రేటర్‌ ఫ్లెమింగోలుగా పిలుస్తారు. వందలాది పక్షులు వరుసగా నిలబడి ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. దేశ, విదేశాల నుంచి 34 రకాల పక్షులు ఇక్కడకు చేరాయి. మే నెలాఖరు వరకు అవి ఇక్కడే మకాం వేస్తాయి.

ఆళంద దర్గాలో

శివపూజలకు సూచన

రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లా ఆళంద దర్గాలో శివరాత్రికి పూజలు నిర్వహిం చాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆళందలోని వివాదిత లాడ్లే మశాక్‌ దర్గాలో వెలసిన రాఘవ చైతన్య శివలింగానికి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపాలని తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పూజారి సిద్దరామయ్యకు అవకాశం కల్పిస్తూ కలబుర్గి హైకోర్టు పీఠం ఆదేశించింది. ప్రత్యేకంగా పూజలు జరపడానికి హిందూ పర సంఘాలు 15 మందికి అవకాశం కల్పించాలని కోరినా హైకోర్టు కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించింది.

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన1
1/4

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన2
2/4

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన3
3/4

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన4
4/4

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement