ప్రాణం మీదకొచ్చిన పంతుళ్ల దండన
గౌరిబిదనూరు: నగర శివారులో ఉన్న విద్యానిధి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో భయపడిపోయి సొమ్మసిల్లాడు. ఉపాధ్యాయుల నిర్వాకం వల్ల బాలుని తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వివరాలు.. వివరాలు.. పక్క విద్యార్థి పుస్తకంలోని పేజీని చించాడని నాలుగైదు మంది ఉపాధ్యాయులు సుశాంత్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి నిలదీశారు. సుశాంత్ నేను పేజీ చించలేదని ఎంత చెప్పినా ఉపాధ్యాయులు వినలేదు. వారి అరుపులకు బాలుడు మూర్ఛపోయాడు. దీంతో హడావుడిగా పాఠశాల వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత తేరుకున్న తరువాత బాలుని తల్లిదండ్రులు అంబులెన్స్‌లో వారి గ్రామం కొడిగేనహళ్ళికు పిలుచుకొని వెళ్లినట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
తాలూకా విద్యాశాఖ అధికారి గంగరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటన దురదృష్టకరం, ఉపాధ్యాయులు విద్యార్థులకు సున్నితంగా చెప్పాలే తప్ప దండించరాదు అని అన్నారు. తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాలునికి తీవ్ర అస్వస్థత


