పారిశుధ్య కార్మికుడిపై దాడి: ఇద్దరు అరెస్ట్
హుబ్లీ: పారిశుధ్య కార్మికుడిపై దాడి చేసిన ఇద్దరిని దావణగెరె అజాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్జు, నూర్ అరెస్ట్ అయిన నిందితులు. కరిబసప్ప దాడికి గురైన వ్యతి. వివరాలు.. దావణగెరె 4వ వార్డు మెహబూబ్ నగర్‌లో శుక్రవారం ఉదయం కార్మికుడు కరిబసప్ప చెత్త సేకరణకు వచ్చాడు. పొడి, తడి చెత్త రెండు కలిపి ఓ మహిళ చెత్త వాహనానికి ఇచ్చింది. ఈ రెండింటికి కలిపి ఇవ్వరాదు.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వమని కోరాడు. దీనిపై మాట మాట పెరగడంతో అజ్జు, నూర్ కలసి కరిబసప్పపై దాడి చేశారు. కరిబసప్ప ఫిర్యాదు మేరకు అజ్జు, నూర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ వసంత్ తెలిపారు. కార్మికుడిపై దాడిని ఖండిస్తూ సదరు కార్మికులు ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి చెత్త వాహనాన్ని తెచ్చి నిరసన తెలిపారు.


