హంపీ ఖ్యాతి అజరామరం | - | Sakshi
Sakshi News home page

హంపీ ఖ్యాతి అజరామరం

Feb 14 2026 7:24 AM | Updated on Feb 14 2026 7:24 AM

హంపీ

హంపీ ఖ్యాతి అజరామరం

సాక్షి బళ్లారి/హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరై మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఎం.పీ.ప్రకాష్‌ వేదిక వద్ద సీఎం సిద్దరామయ్య ఉత్సవాలను ప్రారంభించే ముందు తాయి భువనేశ్వరి విగ్రహానికి పూజలు చేశారు. విరుపాక్షేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచే హంపీకి పర్యాటకులు పోటెత్తారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను మైమరిపించేలా మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడే దిశగా హంపీ ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి రోజు మాతాంగ పర్వత మైదానంలో మత్య్స మేళా, ఫల, పుష్ప ప్రదర్శన, కమలాపురం చెరువులో బోటింగ్‌, విరుపాక్షేశ్వర హంపీ చరిత్రపై చర్చా గోష్టి, మాతాంగ పర్వతం సమీపంలో ఆహార మేళా, ఎద్దుల ప్రదర్శన, రంగోలి పోటీలు నిర్వహించారు. ఈసారి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఆరు వేదికలను సుందరంగా ముస్తాబు చేశారు. హంపీలో కట్టడాలను విద్యుత్‌ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఎంపీ ప్రకాష్‌ వేదిక, శ్రీకృష్ణదేవరాయ వేదిక, శ్రీ విరుపాక్షేశ్వర వేదిక, సాసువేకాళు గణపతి వేదిక, విద్యారణ్య వేదికలపై నిర్వహించిన వివిధ సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేశాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కర్ణాటకలో వివిధ జిల్లాల నుంచి కాకుండే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హంపీ ఉత్సవాలకు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు చేపట్టారు.

రంగోలి పోటీలు

జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖ, వివిధ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విరుపాక్ష ఆలయం ముందు నిర్వహించిన రంగోలి పోటీల్లో 41 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ్‌ ది ఫిమేల్‌ ఫెమి చిత్రం, వరాహ చిహ్నం, శ్రీకృష్ణ దేవరాయలు, శివలింగం, సింహం తదితర చిత్రాలు సహా విరుపాక్ష ఆలయం ముందు వేసిన రంగోలి చిత్రాలు ఆకట్టున్నాయి.

ఎగ్జిబిషన్‌..

హంపీ ఉత్సవాల్లో మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా పురాతన కాలం నాటి మానవులు వాడిన పరికరాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. రోకలితో దంచడం, మహిళలు ఇసరాయితో తిప్పి పిండి తయారు చేయడం, చేదుబావి నుంచి నీటిని తోడటం తదితర దృశ్యాలను పర్యాటకులు తిలకించారు. చిరు ధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు, వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన, పంటకోత వేడుక, వ్యవసాయ ప్రదర్శనలు అలరించాయి. గణేశుడు, కేఎస్‌డీఏ లోగో, ధాన్యాల రూపంలో నంది ప్రతిమ, వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, ట్రాక్టర్లు, పశుపోషణ, పట్టుపురుగుల పెంపకం, ధాన్యాల అమ్మకం చిత్రాలు ఏర్పాటు చేశారు.

మస్త్య ప్రదర్శన

మాతాంగ పర్వత మైదానంలో మత్స్యశాఖ నిర్వహిస్తున్న చేపల ప్రదర్శనను జిల్లా అధికారి కవితా ఎస్‌ మన్నికేరి ప్రారంభించారు. సముద్రంలోని మత్స్యసంపద వైవిధ్యాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశీయ మూలాలకు చెందిన 50కి పైగా అలంకార చేపలను అక్వేరియంలో ఉంచారు. జలాశయంలో కనిపించే చేపల వైవిధ్యం, మత్స్యకారుల జీవనోపాధిలో దాని పాత్రను వివరిస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన పెద్ద సంఖ్యలో ప్రజలు చేపల జాతరను వీక్షిస్తున్నారు.

ఎద్దులను అలంకరించి పోటీలకు తీసుకొచ్చిన

యువకులు

ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం సిద్దరామయ్య

పర్యాటకులతో

కిటకిటలాడిన హంపీ వీధులు

అలరించిన సాంస్కృతిక,

మనోరంజన కార్యక్రమాలు

సాలువేకలు గణపతి వేదికలో సాంస్కృతిక వైభవం

విజయనగర జిల్లా యంత్రాంగం, కన్నడ, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాలువేకలు గణపతి వేదికలో వచనగానం, రంగస్థల గీతాల గానం, జానపద గీతాలు, హిందుస్తానీ గానం, భరతనాట్యం, సుగమ సంగీతం, తబలా వాయిద్యం, శాసీ్త్రయ నృత్యం, నృత్య రూపక, బయలత పదాలు, తత్వపద గానం విషు కళా ప్రదర్శన, మిమిక్రీ, దసరా పదాల గానం, సముహా నృత్య రూపకం, వచన సంగీతం, చౌదకి పదాల గానం, అనేక ఇతర కార్యక్రమాలు వివిధ బృందాలచే ప్రదర్శించబడ్డాయి.

హంపీ ఖ్యాతి అజరామరం1
1/6

హంపీ ఖ్యాతి అజరామరం

హంపీ ఖ్యాతి అజరామరం2
2/6

హంపీ ఖ్యాతి అజరామరం

హంపీ ఖ్యాతి అజరామరం3
3/6

హంపీ ఖ్యాతి అజరామరం

హంపీ ఖ్యాతి అజరామరం4
4/6

హంపీ ఖ్యాతి అజరామరం

హంపీ ఖ్యాతి అజరామరం5
5/6

హంపీ ఖ్యాతి అజరామరం

హంపీ ఖ్యాతి అజరామరం6
6/6

హంపీ ఖ్యాతి అజరామరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement