ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి

ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి

రాయచూరు రూరల్‌: సిద్దరామ ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దేవదుర్గ తాలుకా తింథిణి వద్ద కాగినెల పీఠాధిపతి, హలు మతం గురువు సిద్దరామ ఆనందపురి మహాస్వామి పుణ్యాస్మరణ కార్యక్రమం నిర్వహించారు. గురు పీఠానికి హస్టల్‌, ఇతర సౌలభ్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్‌ పాటిల్‌, బోస్‌రాజ్‌, శివరాజ్‌ తంగడిగి, శరణ బసప్ప దర్శనాపూర్‌, మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్‌, వెంకట్రావ్‌ నాడగౌడ, మాజీ ఎంపీ విరుపాక్షప్ప పాల్గొన్నారు.

నెల రోజుల్లో కులగణన జాబితా విడుదల

రాష్ట్రంలో జరిపిన కులగణన జాబితాను నెల రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య వెల్లడించారు. ఆదివారం కలబుర్గిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు అధికార వ్యామోహం లేదన్నారు. పోరాటాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement