అమ్మ కిరాతకం | - | Sakshi
Sakshi News home page

అమ్మ కిరాతకం

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

అమ్మ కిరాతకం

అమ్మ కిరాతకం

ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్యాయత్నం

దొడ్డబళ్లాపురం: ఎంత కష్టం వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లి.. కుటుంబ కలహాలతో కిరాతకురాలిగా మారింది. ముగ్గురు కన్నబిడ్డలను చంపి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బాగలకోట జిల్లా బాదామి తాలూకా హీరేముచ్చలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. రూప (30) అనే తల్లి, సమృద్ధి (5), ప్రీతమ్‌ (4) సుక్షిత్‌ (2) అనే తన ముగ్గురు చిన్నారి కొడుకులకు ఉరివేసి చంపింది, తరువాత డీజిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు 2018లో హనుమంత అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త, అత్త రేణవ్వల వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రూప బాగలకోటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement