భక్తవత్సలా.. గోవిందా
మాలూరు: మాఘ పౌర్ణమి శుభదినం కావడంతో తాలూకాలో మరో తిరుమలగా పేరుపొందిన చిక్కతిరుపతి ప్రసన్న వెంకటశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బెంగుళూరు, పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళునాడు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఏడుకొండలవాడిని, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్ నేతృత్వంలో స్వామికి అభిషేకం, పంచామృత అభిషేకం, పూజలను నిర్వహించారు.
చిక్క తిరుపతిలో
పూర్ణమి పూజలు
భక్తవత్సలా.. గోవిందా


