మేలుకోటెలో పునర్వసు వైభవం
మండ్య: ఆదివారం మాఘపౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేలుకోటెలో రామానుజ పునర్వసు ఉత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని రామానుజ, చెలువనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఏటా మకర శుక్ల పునర్వసు నక్షత్రం నాడు తాయి పునర్వసు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పవిత్ర దినాన రామానుజాచార్యులు యదుగిరిలోని కగ్గత్తల అడవిలో శయనించిన చెలువ నారాయణున్ని దర్శనం చేసుకుని ప్రపంచానికి జ్ఞానోదయం కలిగించారని పురాణేతిహాసం ఉంది. రామానుజాచార్యులకు పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు.
మేలుకోటెలో పునర్వసు వైభవం


