చిట్టి బుర్రలు.. గట్టి చేతలు
రాయచూరు రూరల్: ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో పిల్లల పండుగ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను ఇలాంటి వేదికల్లో ప్రదర్శించవచ్చన్నారు. జిల్లా ఉత్సవాలను ఇంటింటా పండుగలా జరపాలన్నారు. ప్రచార వేదికల్లో పిల్లలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నారు. వన్య ప్రాణులు, కీటకాలు, జీవరాశుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తుమ్మెద, సీతాకోకచిలుక, తేలు, ఈగలు, దోమలు, తేనె టీగలు, బాతు, నాట్యం చేస్తున్న రోబో మహిళ, రైతు, స్వామీజీ, శ్రీరాముడి చిత్రాలు అలరించాయి. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డిలున్నారు.
ఉత్సవాలు విజయవంతం చేయండి
అధికారులకు జిల్లాధికారి నితీష్ పిలుపు
చిట్టి బుర్రలు.. గట్టి చేతలు
చిట్టి బుర్రలు.. గట్టి చేతలు
చిట్టి బుర్రలు.. గట్టి చేతలు


