రమణీయంగా దుర్గాంబ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయంగా దుర్గాంబ రథోత్సవం

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

రమణీయ

రమణీయంగా దుర్గాంబ రథోత్సవం

జనసంద్రమైన అంతరఘట్ట క్షేత్రం

బొమ్మనహళ్లి: దేవాదాయ శాఖ పరిధిలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకాలోని అంతరఘట్టలో వెలసిన శ్రీదుర్గాంబ అమ్మవారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరిగింది. శనివారం నుంచి అమ్మవారి మూల విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఆలయంలో ప్రాకారోత్సవం జరిపారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని సంగీత వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి పూలతో అలంకరించిన రథంలో ప్రతిష్టించారు. ఆలయ అధికారులు, భక్తులు రథ చక్రాలపై కొబ్బరికాయలు పగలగొట్టి, ‘అంతర్ఘట్ట మాతకి జై’ ‘దుర్గా మాతకు జై’ అని ఘోషిస్తూ తేరును లాగారు. భక్తులు తేరు మీదకు అరటి, నారింజ పండ్లు, కోళ్లను విసిరి, తమ కోరికలు నెరవేరాలని మొక్కుకున్నారు.

ప్రత్యేక దర్శనాలు

రథోత్సవం తర్వాత, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ సీ్త్రలు మొదలైనవారి కోసం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు, చుట్టుపక్కల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ రకాల దుకాణాలు, వినోద కేంద్రాలు వెలిశాయి.

రమణీయంగా దుర్గాంబ రథోత్సవం1
1/1

రమణీయంగా దుర్గాంబ రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement