వైభవంగా నాగర యల్లమ్మ జాతర
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా శక్తి నగర్‌లో వెలసిన మాతా నాగర యల్లమ్మ జాతర ఘనంగా జరిగింది.ఽ శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఆదివారం దేవ సూగురు దేవాలయం వద్ద సూగురేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయం నుంచి యల్లమ్మ ఆలయం వరకు కలశాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. నాగర యల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో శశికళ, వీరేష్, సుదీప్, మరళయ్య, సిద్దరామయ్య, అశోక్, బసవరాజ్, ప్రకాశయ్య, శివయ్య, హంపన గౌడ, శకుంతల, సురేష్ తదతరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల
నియంత్రణకు పకడ్బందీ చర్యలు
రాయచూరు రూరల్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో జిల్లా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార ఆద్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తులకు బాటలు వేసుకోవాలని తెలిపారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. తల్లీ, బిడ్డ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. మీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరిగితే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి నవీన్ కుమార్, జిల్లా కార్మిక అధికారి హారతి, బీఈఓ ఈరణ్ణ, సుదర్శన్, కుంటప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఉల్లి ధర పతనం
రాయచూరు రూరల్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టాలపాలవుతున్నారు. లాభాలు వస్తాయనే ఆశతో రాయచూరు జిల్లాలో 753 హెక్టార్లు, యాదగిరిలో 658 హెక్టార్లు, కొప్పళ జిల్లాలో 569 హెక్టార్లు, బళ్లారిలో 489 హెక్టార్లో ఉల్లి సాగు చేశారు. అయితే ధరల పతనంతో ఉల్లి సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. రాయచూరు ఏపీఎంసీ మార్కెట్‌లో క్వింటా రూ.205 నుంచి రూ.709 వరకూ ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మద్దతు ధర లేకపోవడంతో శనివారం సాయంత్రం ఓ రైతు 62 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను మార్కెట్‌లో వదిలేసి పోయాడు. రాయచూరు ఏసీఎంసీ మైదానంలో ఉల్లి గడ్డలను పశువులకు వదిలేసిన దృశ్యం కనిపించింది.
రైల్వే ప్రయాణికులకు
తప్పని తిప్పలు
రాయచూరు రూరల్: ఉత్తర, కల్యాణ కర్ణాటకలోని ప్రజలు రైలు ప్రయాణం అంటే భయాందోళన చెందుతున్నారు. రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో అవస్థలు పడుతున్నారు. అదనపు బోగీలను అమర్చకుంగా కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులతో చెలగాటమాడుతోంది. శనివారం రాత్రి యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్‌లో వివిధ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. జనరల్ బోగీల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కిక్కిరిసిపోయాయి.
గంగమ్మా కాపాడమ్మా
కేజీఎఫ్: తాలూకాలోని నాచపల్లి గ్రామంలో గంగమ్మ దేవాలయ 138వ సంవత్సరం జాత్రా మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతోను, వివిధ రకాల పూలతోను అలంకరించారు. మహిళలు 201 బిందెలను తలపై మోసుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రధాన అర్చకులు గురుదీక్షిత్ నేతృత్వంలో పూజలు జరిగాయి.
వైభవంగా నాగర యల్లమ్మ జాతర
వైభవంగా నాగర యల్లమ్మ జాతర
వైభవంగా నాగర యల్లమ్మ జాతర


