వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి

సాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ తలపల మండల కేంద్రం బి.కొత్తపల్లి చెందిన విజయ రాఘవరెడ్డిని వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌ అధ్యక్షుడిగా పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్యాల విజయభాస్కర్‌ రెడ్డి నియమించారు. విజయరాఘవ రెడ్డి గత 15 ఏళ్లు నుంచి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల క్షేత్ర స్థాయిలో పార్టీ విధివిధానాలకు కట్టుబడి, క్రమశిక్షణ కలిగిన ఐటీ వింగ్‌ సభ్యుడిగా సేవలు అందించారు.

నేతలకు ధన్యవాదాలు

ఈ నియామక ఉత్తర్వులు రావడానికి కృషి చేసిన జోనల్‌ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విజయరాఘవ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు మిథున్‌ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉషాశ్రీ చరణ్‌, కదిరి సమన్వయకర్త మక్బూల్‌, పీఏసీ కోర్డినేటర్‌ వజ్రభాస్కర్‌ రెడ్డి, ఐటీ వింగ్‌ అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ భాస్కర్‌ రెడ్డి, మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, బెంగళూరు ఐటీ వింగ్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు శక్తివంతంగా కృషి చేస్తూ 2029 ఎన్నికల్లో జన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి ఐటీ వింగ్‌ ద్వారా ఒక శక్తివంతమైన సైన్యంగా పని చేస్తామని విజయ రాఘవరెడ్డి తెలిపారు.

ఏపీ ఐటీ వింగ్‌ ఉపాధ్యక్షుడిగా కుమార్‌

సాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ ఉపాధ్యక్షుడిగా ఎ.కుమారస్వామి రెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కుమార్‌ నియామకం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ పార్టీ గెలుపు కోసం ఎంతో తీవ్రంగా శ్రమిస్తూ తన సేవలను అందించారు. తనపై నమ్మకం ఉంచి ఐటీ వింగ్‌ రాష్ట్ర ఉపాధ్యక్ష హోదా కల్పించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంపీ అవినాశ్‌ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్‌ అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులకు, బెంగళూరు ఐటీ వింగ్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

విజయ రాఘవరెడ్డి నియామకం

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి1
1/2

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి2
2/2

వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు కొత్త సారథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement