విద్యార్థులకు సంస్కారం ప్రధానం
రాయచూరు రూరల్: విద్యార్థులకు సంస్కారం ప్రధానం. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి నుంచే సంస్కారం నేర్పించాలని రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారిణి ఇందిర పేర్కొన్నారు. శనివారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కన్నడ పాఠశాలల్లో అ నుంచి ఔ వరకు, ఆంగ్లంలో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న విద్యార్థుల మనోబలాన్ని పెంచి ఉన్నత ఫలితాలు సాధించాలన్నారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హిమబిందు, శీతల్, అనిత, రాజేష్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సంస్కారం ప్రధానం


