అడ్డగోలు నియామకాల రద్దుకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు నియామకాల రద్దుకు డిమాండ్‌

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

అడ్డగోలు నియామకాల రద్దుకు డిమాండ్‌

అడ్డగోలు నియామకాల రద్దుకు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అడ్డగోలుగా నియామకాలు చేశారని, అలాంటి నియామకాలను రద్దు చేయాలని కర్ణాటక నాయక్‌ వేదిక పోరాట నేత రవి కుమార్‌ నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసిన రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించుకొని ఉత్తర్వులను గాలికొదిలారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌– 371(జె) ప్రకారం కాకుండా, రిజర్వేషన్‌ కోటాను పాటించకుండా నియామకాలు చేశారని, అలాంటి వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశామని తెలిపారు. అనుమతి లేనిదే నియామకాలు చేసుకున్న పోస్టులను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకో వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement