సమస్యల పరిష్కారానికి పోరాడతాం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి పోరాడతాం

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

సమస్యల పరిష్కారానికి పోరాడతాం

సమస్యల పరిష్కారానికి పోరాడతాం

బళ్లారి అర్బన్‌: సమస్యల పరిష్కారానికి న్యాయ సమ్మతమైన పోరాటం చేస్తామని బళ్లారి అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (బుస్మా) గౌరవ అధ్యక్షుడు ఎంఏ ఆనంద్‌, ప్రధాన కార్యదర్శులు డీ.శశికుమార్‌, ఎన్‌.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని బసవ భవన్‌లో బళ్లారి అన్‌ఎయిడెడ్‌ పాఠశాల నిర్వహణ సంఘం రజతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బళ్లారి సంఘం 25 ఏళ్ల ప్రస్తానాన్ని గురించి మరిస్వామి రెడ్డి మాట్లాడారు. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ తదితర పాఠశాలల సంక్షేమం కోసం సంఘం యొక్క కృషిని కొనసాగిస్తామన్నారు. పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వ సారథులతో పాటు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. రజతోత్సవ వేడుకల్లో కీలక అంశాలపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం బళ్లారి శాఖ అధ్యక్షుడు మరిస్వామి రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి రంజాన్‌, కార్యదర్శి రియాజ్‌, అలాగే వివిధ జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు ముఖ్యంగా చైతన్య పీయూ కళాశాల అధ్యక్షుడు విష్ణు ఆ సంఘం కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement