పిల్లలకు విజ్ఞానంపై ఆసక్తి అవసరం
రాయచూరు రూరల్: జిల్లాలో పిల్లల పండుగల్లో భాగంగా పిల్లల్లో దాగి ఉన్న విజ్ఞానంపై దృష్టి సారించి, ఎడెదొరె రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్య అభిప్రాయపడ్డారు. సోమవారం మావిన చెరువు వద్ద జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయితీ, నగర పాలక సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల పండుగ వేడుకను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పిల్లలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను ఎడెదొరె నాడు రాయచూరు జిల్లా ఉత్సవాల్లో ప్రదర్శించాలన్నారు. వేదికల్లో పిల్లలు తమ సామర్థ్యాన్ని నిరూపించాలన్నారు. ఆకాశంలో చంద్రుడిని బయోస్కోప్ ద్వారా చూడడం, పిల్లల్లో శాసీ్త్రయ మనోభావాలను పెంపొందించడం వంటి వాటికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కోడిపుంజుల ప్రదర్శనలు, గణేష్ కుద్రోళి ఇంద్రజాల ప్రదర్శన, శ్రీరాముడి వేషధారణ ఆకట్టుకుంది. గాలి పటాలను ఎగుర వేసే కార్యక్రమాన్ని నెరవేర్చారు. జిల్లాధికారి నితీష్, జడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, అదనపు జిల్లాధికారి శివానంద, ఏసీ హంపణ్ణ, నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, ఈరణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, రవిలున్నారు.
పిల్లలకు విజ్ఞానంపై ఆసక్తి అవసరం


