ఆ గ్రామంలో పేలుళ్ల బెడద | - | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో పేలుళ్ల బెడద

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

ఆ గ్ర

ఆ గ్రామంలో పేలుళ్ల బెడద

దొడ్డబళ్లాపురం: బీదర్‌ జిల్లాలో హుమనాబాద్‌ తాలూకా మోళకేర గ్రామంలో పేలుడు జరిగి 6మంది గాయపడ్డారు. గ్రామంలోని మారయ్య దేవాలయం వీధిలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించింది. ఎలాంటి పేలుడు పదార్థం అనేది తెలియాల్సి ఉంది. ఆ సమయంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆరుమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. హుమనాబాద్‌ పోలీసులు పరిశీలించి పేలుడు పదార్థాల అవశేషాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. దర్యాప్తు ప్రారంభించారు.

6 నెలల్లో 5 సార్లు

గత 6 నెలల వ్యవధిలో 5 సార్లు గ్రామంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరు ఈ పేలుళ్లకు పాల్పడుతున్నారో గుర్తించి పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

పాఠశాలలో విస్ఫోటం

దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ పాఠశాలలో పేలుడు సంభవించి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు రూరల్‌ దేవనహళ్లి తాలూకా విజయపుర పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో జరిగింది. 7వ తరగతి బాలుడు బయటి నుంచి కార్బన్‌ కెమికల్‌ డబ్బాను తీసుకువచ్చాడు. పాఠశాలలోని బాత్రూంలో జగ్గులో నీరు తీసుకుని కెమికల్‌తో ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెద్దగా పేలుడు జరిగి అతడు గాయపడ్డాడు. అతన్ని దేవనహళ్లి ఆస్పత్రికి తరలించారు. విజయపుర పట్టణ పోలీసులు పాఠశాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఏం చేస్తున్నారనేది ఉపాధ్యాయులు పట్టించుకోకవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.

6 మందికి గాయాలు

ఆ గ్రామంలో పేలుళ్ల బెడద 1
1/1

ఆ గ్రామంలో పేలుళ్ల బెడద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement