నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

నేత్ర

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం

మండ్య: మండ్య జిల్లా మలవళ్లి పట్టణంలో పట్టాలదమ్మ– దండిన మారెమ్మ శక్తి దేవతల సిడి జాతర మహోత్సవం శనివారం నేత్రపర్వంగా ముగిసింది. జాతర మహోత్సవం శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధ పూజలతో ప్రారంభమైంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.ఎం. నరేంద్రస్వామి హాజరై పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురవాలని, దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఈ ఉత్సవం వందేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు అమ్మవార్ల ఉత్సవమూర్తుల సిడి రాణా ఊరేగింపు ప్రారంభమైంది. వేల సంఖ్యలో భక్తుల సమక్షంలో ఉదయం 9గంటలకు సుల్తాన్‌ రోడ్డు గుండా తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. నూతన వధూవరులు పండ్లు, కూరగాయలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు అగ్ని గుండం వెలిగించి భక్తులు నిప్పుల్లో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఐజీపీ నంజుడస్వామి, జిల్లా ఎస్పీ శోభారాణి ఘాట్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం1
1/2

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం2
2/2

నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement