కరెంటు షాక్‌తో ఇద్దరు మృత్యువాత
రాయచూరు రూరల్: రాయచూరు, బెళగావి జిల్లాల్లో కరెంటు తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. శుక్రవారం రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కురుకుందకు చెందిన తనుశ్రీ (10) పాఠశాలలో తాగునీటి కోసం వెళ్లిన సమయంలో కరెంటు తీగలు తగిలాయి. దీంతో షాక్ కొట్టి కిందపడిపోయింది, వెంటనే ఆమెను ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించగా, రాత్రి మరణించిందని తుర్విహాళ్ యస్‌ఐ సుజాత నాయక్ తెలిపారు.
పంప్‌సెట్టు ఆన్ చేస్తూ
బెళగావి జిల్లా అథణి తాలూకా ఖేతనహట్టిలో విద్యుత్ షాక్ తగిలి వైష్ణవి మోహన మోరో (25) అనే యువతి మరణించింది. ఇంటి పంప్‌సెట్ మోటారును ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే మృత్యువాత పడిందని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
లోకాయుక్త వలలో ఎస్‌ఐ
● కారును విడుదల చేయడానికి రూ.లక్ష లంచం
● తుమకూరులో కలకలం
తుమకూరు: స్వాధీనం చేసుకున్న కారును విడిపించేందుకు లంచం తీసుకుంటున్న తుమకూరు రూరల్ ఠాణా ఎస్‌ఐ చేతన్ లోకాయుక్తకు దొరికాడు. బాధితుడు, లోకాయుక్త సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు... 3 రోజుల క్రితం నగేష్ అనే వ్యక్తి తన కారును కేసరుమడు గ్రామం సమీపంలో వదిలేసి వెళ్లాడు. తరువాత అనుమానాస్పద కారుగా భావించి రూరల్ ఠాణా పోలీసులు దానిని తీసుకెళ్లారు. ఇది తెలిసి నగేష్ వచ్చి తన కారును విడిచిపెట్టాలని ఎస్‌ఐ చేతన్‌ను కోరాడు. అందుకుగాను రూ. లక్ష లంచం ఇవ్వాలని చేతన్ డిమాండ్ పెట్టాడు.
గంజాయి కేసు పెడతానని
తాను డబ్బులు ఇవ్వలేనని నగేష్ మొరపెట్టుకోగా, డబ్బు ఇస్తేనే కారు వదులుతా, లేదంటే నిన్ను కూడా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపుతానని ఎస్‌ఐ బెదిరించాడు. ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సూచన మేరకు బాధితుడు మొదటి విడతగా రూ.40 వేలను కాత్సంద్ర సమీపంలోని ఒక హోటల్ సిబ్బందికి శుక్రవారం రాత్రి ఇస్తూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి సిబ్బందిని పట్టుకున్నారు. వారిని విచారించగా, ఎస్‌ఐ చేతన్ సూచనల మేరకు డబ్బు అందుకున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లోనే చేతన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారణకు తరలించారు.
కరెంటు షాక్‌తో ఇద్దరు మృత్యువాత


