డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో దగ్గరవుతున్న దూరవిద్య | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో దగ్గరవుతున్న దూరవిద్య

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో దగ్గరవుతున్న దూరవిద్య

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో దగ్గరవుతున్న దూరవిద్య

స్థలంపై యశ్‌ తల్లి గొడవ

యశవంతపుర: హాసన్‌ నగరంలో ప్రముఖ నటుడు యశ్‌ తల్లి ఇంటి పక్కలోని ఖాళీ స్థలం వివాదం మళ్లీ మొదలైంది. ఆమె ఆ స్థలంలో కట్టిన కాంపౌండ్‌ను గతంలో దేవరాజు, అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తులు ధ్వంసం చేశారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. పుష్పా మళ్లీ కాంపౌండ్‌ను నిర్మించడానికి యత్నించారు. దేవరాజు రాగా, ఆ జాగా పత్రాలను చూపించాలని ఆమె అడగడంతో వాగ్వాదం జరిగింది. నా కొడుకు ఒక సెలబ్రిటీ, నేను ఇక్కడి పుట్టి పెరిగానంటూ ఆమె గట్టిగా చెప్పింది. ఇలా మాట్లాడటం సరికాదంటూ దేవరాజు అడ్డు తాగిలాడు. రౌడీలను తీసుకొచ్చి రౌడీయిజం చేయవద్దని పుష్పా చెబుతూ ఎస్పీకీ ఫిర్యాదు చేసింది.

మైసూరు: విద్య అనేది స్వావలంబన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే శక్తి అని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అన్నారు. నగరంలోని ముక్త గంగోత్రిలోని రాష్ట్ర ఓపెన్‌ విశ్వవిద్యాలయ ఘటికోత్సవ భవన్‌లో జరిగిన ఆ వర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. ఎనిమిది మందికి గౌరవ డాక్టరేట్లు, 68 మందికి పీహెచ్‌డీలు, వివిధ అంశాలలో ర్యాంకులు సాధించిన వారికి 65 బంగారు పతకాలు, 62 నగదు బహుమతులను అందజేశారు. గవర్నర్‌ మాట్లాడుతూ విద్య, జ్ఞానాన్ని దేశం, సమాజ సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దూరవిద్యను అందరికీ చేరువ చేయడంలో రాష్ట్ర ఓపెన్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శరణప్ప వి. హలాసే, ఆయన బృందం విశేషంగా కృషిచేస్తోందని కొనియాడారు. ప్రొఫెసర్‌ భాష్యం స్వామీజీ, బి.ఎస్‌. నాగభూషణ్‌ అత్రి, బ్రహ్మకుమారి లక్ష్మీ, డాక్టర్‌ సి. సోమశేఖర్‌, కె.బి. లింగరాజు, సతీష్‌ కుమార్‌ డి. కగ్గెరే, శివశంకర్‌ టోకరే, ఎస్‌. శివకుమార్‌లకు గౌరవ డాక్టరేట్లు అందజేశారు. వీసీ హలాసే, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నవీన్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ వాల్యుయేషన్‌ డాక్టర్‌ సి.ఎస్‌. ఆనంద్‌ కుమార్‌, డీన్‌ రామనాథం నాయుడు, జైనహళ్లి సత్యనారాయణ, గణేష్‌, డాక్టర్‌ హేమలత పాల్గొన్నారు.

కర్ణాటక ఓపెన్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement