రహదారి ప్రమాదాల నియంత్రణపై జాతా | - | Sakshi
Sakshi News home page

రహదారి ప్రమాదాల నియంత్రణపై జాతా

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

రహదారి ప్రమాదాల నియంత్రణపై జాతా

రహదారి ప్రమాదాల నియంత్రణపై జాతా

రాయచూరు రూరల్‌: రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్‌ తెలిపారు. శనివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో జిల్లా పాలన యంత్రాంగం, జాతీయ రహదారి అభివృద్ధి మండళి, రాయచూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. సైబర్‌ నేరాలపై యువకులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొన్నారు. అనంతరం సుమారు 500 మంది విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్‌, నగర సభ కమిషనర్‌ జుబీన్‌ మోహపాత్రో, భావనేష్‌ కుమార్‌ గుప్తా, డీఎస్పీ శాంతవీర్‌, ఎస్‌ఐలు ఈరేష్‌ నాయక్‌, బసవరాజ్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement