వరిగడ్డే బంగారమాయెగా.! | - | Sakshi
Sakshi News home page

వరిగడ్డే బంగారమాయెగా.!

Feb 3 2026 7:47 AM | Updated on Feb 3 2026 7:47 AM

వరిగడ

వరిగడ్డే బంగారమాయెగా.!

హొసపేటె: తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక పనులతో ఈసారి ఆయకట్టు కింద రెండో పంటకు నీరు లేక క్రాప్‌ హాలిడే ప్రకటించిన కారణంగా రైతులు వర్షాకాలంలో పండించిన వరిగడ్డిని తాలూకా అంతటా కుప్పలుగా పేర్చి జాగ్రత్తగా నిల్వ చేస్తున్నారు. అంతటా సీజన్‌లో పంటలు పండించే వరకు, ఎండిన వరి మేత, మొక్కజొన్న కాండాలు, కందులు, వేరుశెనగ పొట్టును రైతుల జీవనోపాధికి, పశువులకు అత్యవసర ఆహారంగా ఉపయోగిస్తారు. తాలూకాలో చాలా మంది రైతులు తుంగభద్ర కుడి దిగువ, ఎగువ కాలువలు, తుంగభద్ర నది, విజయనగర కాలువ, చెరువులు, మాగాణి భూములు, బోరుబావుల కింద 23,000 హెక్టార్లలో వివిధ రకాల వాణిజ్య పంటలు సాగు చేశారు. ఇప్పుడు ఆ రైతులు తమ పొలాలు, పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లో తమ పశువుల రక్షణకు దీర్ఘచతురస్రాకార, త్రిభుజాకార, చతురస్రాకార, పిరమిడ్‌ ఆకారాలలో మేతల కుప్పలను నిర్మించారు. మరి కొందరు టార్పాలిన్లతో కప్పుకున్నారు. ఇంకొందరు షెడ్లలో మేతను నిల్వ చేసుకున్నారు.

వరిగడ్డే బంగారమాయెగా.! 1
1/1

వరిగడ్డే బంగారమాయెగా.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement