త్రిభాషా కవి మృతికి సంతాపం
రాయచూరు రూరల్: త్రిభాషా కవి వీఎస్ కాంతనవర్ మృతికి ఆదివారం సాయంత్రం కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు విజయ రాజేంద్ర పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కవితలు రాసి మంచి పేరు సంపాందించారన్నారు. కలబుర్గి విశ్వ విద్యాలయం నుంచి అవార్డు, ప్రథమ తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా పని చేశారన్నారు. ఆయన మృతిపై సాహితీ వేత్తలు, కవులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాప సభలో వీర
హనుమాన్, వెంకట్రావ్, హక్కి, రావుత్‌రావ్, లక్ష్మిదేవి, నాగప్ప, నాగరాజ్, తిమ్మయ్య, వెంకటేష్, అమరేష్, ఈరణ్ణలున్నారు.
నర్సింగ్ సేవల్లో
కన్నడిగులు ముందంజ
రాయచూరు రూరల్: దేశ, విదేశాల్లో ఆరోగ్య రంగంలో కర్ణాటక నుంచే అత్యధిక స్థాయిలో నర్సుల సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యవిద్య, నర్సింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి ద్వితీయ సంవత్సరం నర్సింగ్ విద్యార్థుల ప్రతిజ్ఞా విధిని బోధించి మాట్లాడారు.నర్సింగ్ కోర్సులో కేరళ తరువాత కర్ణాటక విద్యార్థులు వైద్య, ఆరోగ్య రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. జపాన్, ఇటలీ, దుబై వంటి దేశాల్లో సేవలు అందిస్తున్న వారికి భాషా పరిజ్ఞానం ప్రధానమన్నారు. రాష్ట్రంలో 32 నర్సింగ్ కళాశాలలుండగా, 80 వేల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ సందీప్, రిజ్వాన్, పంపాపతి రెడ్డి, కాశీనాథ్, సిద్దరామప్ప తదితరులు పాల్గొన్నారు.
త్రిభాషా కవి మృతికి సంతాపం


