నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

 నేత్

నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం

హొసపేటె: తాలూకాలోని హంపీ రహదారిలో ఆదివారం గాలెమ్మ దేవి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, పలు ధార్మిక పూజలు చేశారు. అంతకుముందు అమ్మవారిని వెండి ఆభరణాలతో అలంకరించారు. కమలాపురం, హంపీ, కడ్డిరాంపురం, మలపనగుడి, కొత్త మలపనగుడి, కొండ నాయకనహళ్లి, అనంతశయనగుడి, నాగేనాహళ్లి, బసవణదుర్గ, హొసపేటె వివిధ వార్డుల నుంచి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా గుత్తేదారుడు పి.బాబు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

 నేత్రపర్వంగా  గాలెమ్మ దేవి రథోత్సవం 1
1/2

నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం

 నేత్రపర్వంగా  గాలెమ్మ దేవి రథోత్సవం 2
2/2

నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement