ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్ ఇస్తా కానీ...
శివాజీనగర: ఎమ్మెల్యేలందరికీ సర్కారు నుంచి ల్యాప్‌టాప్ కానీ, ఐఫోన్ కానీ ఇచ్చే ఆలోచన తమకుంది, దీనిని ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాలి అని విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్ అన్నారు. విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్ ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి స్పందిస్తూ, ల్యాప్‌టాప్ ఇచ్చే ఆలోచన ఉంది, దానిని ఎమ్మెల్యేలు ఉపయోగించకుండా, బంధుమిత్రులకు ఇచ్చేస్తే ప్రయోజనం ఉండదు. మీరే వాడుకుంటామంటే ఇస్తాను అని షరతు విధించారు. ల్యాప్‌టాప్ వాడకంపై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఇందులో పాల్గొన్నవారికి ఐఫోన్ కూడా ఇస్తానని తెలిపారు.
తక్కువ హాజరుపై రగడ
శాసనసభ ఆరంభంలో మంత్రులు, ఎమ్మెల్యే లు చాలా తక్కువమందే వచ్చారు, ఇది చూసి బీజేపీ నాయకుడు ఆర్.అశోక్.. మంత్రుల వరుసలో ఎవరూ లేరు. అధికార పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. అధికారపక్షం పూర్తిగా ఖాళీగా ఉంది. గవర్నర్ ప్రసంగంపై మేము చర్చించినా కూడా దానిని రాసుకోవడానికి ఎవరూ లేరని చెప్పారు. మాట్లాడేందుకు స్ఫూర్తి రావాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండాలి, ఇక్కడ ఎవరూ లేరే అని హేళన చేశారు.
వారు వస్తారు, మీరు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఇంతలో హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాగా, వేరొకరు హోంమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి రాజీనామా చేయించేవారమని అశోక్ అన్నారు. ఆరుమంది మంత్రులు వచ్చాక చర్చ మొదలుపెట్టారు.
వారే వాడుకోవాలి
స్పీకర్ ఖాదర్ షరతు


