సౌండ్‌ప్రూఫ్‌ గదిలో కాల్పులు.. | - | Sakshi
Sakshi News home page

సౌండ్‌ప్రూఫ్‌ గదిలో కాల్పులు..

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

సౌండ్‌ప్రూఫ్‌ గదిలో కాల్పులు..

సౌండ్‌ప్రూఫ్‌ గదిలో కాల్పులు..

బనశంకరి: కాన్పిడెంట్‌ సంస్థ చైర్మన్‌ సీజే రాయ్‌ ఆత్మహత్యపై బెంగళూరులో సిట్‌ అధికారులు, అశోక్‌నగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆఫీసులోని ఆయన చాంబర్‌లో పూర్తిగా సౌండ్‌ప్రూఫ్‌ కావడంతో పిస్టల్‌ కాల్పుల శబ్ధం ఎవరికీ వినబడలేదు, అందుకే ఘటన జరిగిన 20 నిమిషాలైనా అప్రమత్తం కాలేదని బెంగళూరు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పూర్తిగా సౌండ్‌ప్రూఫ్‌తో ఉన్నందున లోపల అసాధారణ ఘటన జరిగినప్పటికీ బయటకు చప్పుడు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం రాలేదు. ఐటీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తుండగా మద్యాహ్నం 3 గంటల సమయంలో తన తల్లితో మాట్లాడాలని గదిలోకి వెళ్లిన రాయ్‌ ఎవరినీ లోపలకు వదలరాదని తన సిబ్బందికి ఆదేశించి డోర్‌ వేసుకున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోసెఫ్‌ కొంతసేపటికి చాంబర్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సిబ్బంది రాయ్‌ చెప్పిన మాటలనే చెప్పారు. దీంతో కంగారుపడిన జోసెఫ్‌ కొన్ని నిమిషాలు వేచి ఉంచి డోర్‌ గట్టిగా తట్టారు. లోపల నుంచి స్పందన రాకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా రాయ్‌ కుర్చీలో రక్తపుమడుగులో కూర్చునట్లు ఉన్నాడు. ఆ పిస్టల్‌ విదేశాలకు చెందినది, చాలా ఖరీదైనదని తెలిసింది. పోలీసులు ఆ పిస్టల్‌ను సీజ్‌ చేశారు.

అందుకే వినబడలేదా?

సీజే రాయ్‌ ఆత్మహత్య కేసులో విచారణ

కేరళ సీఎం ఆందోళన

ఐటీ అధికారుల సోదాల సమయంలో వ్యాపారవేత్త సీజే.రాయ్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మీద న్యాయ విచారణ జరిపించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. కేరళకు చెందిన రాయ్‌ కేరళ, బెంగళూరు, దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసేవారు, గత శుక్రవారం బెంగళూరులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోవడం తెలిసిందే. ఈ ఘటనపై కేరళ సీఎం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం లేఖ రాశారు. సీజే.రాయ్‌ ఆత్మహత్య ఘటన దేశంలో ఐటీ పాలనపై బ్లాక్‌డే అని విజయన్‌ దుయ్యబట్టారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రాయ్‌ ఆత్మహత్యకు పాల్పడటం అశ్చర్యం కలిగిస్తోందని, రాయ్‌ను ఐటీ వేధింపులకు గురిచేసి బలిపశువుగా చేశారని దుయ్యబట్టారు. వ్యక్తిగత హక్కులను కాపాడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement