రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు.
29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.
4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్‌పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.
అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.
అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.
చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి


