ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి.. కోహ్లి మాత్రం తన అద్బుత బ్యాటింగ్‌తో అభిమానుల్లో గెలుపు ఆశలను రేకెత్తించాడు.
ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది.
న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు.


