టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అక్షర్ గాయపడ్డాడు.
కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
మిగిలిన ఓవర్‌ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అక్షర్ గాయం తీవ్రమైనది కానట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్రమే చిట్లడం వల్ల రక్త స్రవమైందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ శుక్రవారం జరగనున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.
ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: అటు గిల్... ఇటు జడేజా


