రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్‌తో పాటు బంతితో విఫలమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై పఠాన్ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
రాజ్‌కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో 60 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్‌తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
టెస్ట్ క్రికెట్‌లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.
2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మంచిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్


