కేఎల్ రాహుల్ సెంచరీ.. భార‌త్ స్కోరెంతంటే? | KL Rahul's Unbeaten Ton Steers India To 284 Runs vs NZ | Sakshi
Sakshi News home page

IND vs NZ 2nd ODI: కేఎల్ రాహుల్ సెంచరీ.. భార‌త్ స్కోరెంతంటే?

Jan 14 2026 5:17 PM | Updated on Jan 14 2026 5:19 PM

KL Rahul's Unbeaten Ton Steers India To 284 Runs vs NZ

రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌ర‌గుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 120 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును రాహుల్ త‌న సెంచ‌రీతో ఆదుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్ద‌రూ 70 ప‌రుగుల భాగ‌స్వామమ్యం నెల‌కొల్పారు. రోహిత్‌(24) ఔట‌య్యాక గిల్‌(56), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(8), విరాట్ కోహ్లి(23) వెంట‌వెంట‌నే పెవిలియ‌న్‌కు చేరారు.

ఈ క్ర‌మంలో రాహుల్ ఆల్‌రౌండర్‌ ర‌వీంద్ర జ‌డేజా(27)తో క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దాడు. జ‌డేజా ఔటైన‌ప్ప‌టికి రాహుల్ మాత్రం త‌న ఏకాగ్ర‌త‌ను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో త‌న ఎనిమిదివ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను కేఎల్ అందుకున్నాడు.

ఫలితంగా భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసింది. మొత్తంగా రాహుల్‌ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక​ సిక్సర్‌తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టేన్‌ క్లార్క్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్‌, పౌల్క్స్‌చ, బ్రెస్‌వెల్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: BBL: పాక్‌ ప్లేయర్‌కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement