గంభీర్ చూశావా? తొలి ఓవర్‌లోనే వికెట్‌! వీడియో వైరల్‌ | Internet Slams Gautam Gambhir As Arshdeep Singh Strikes In 1st Over On Return | Sakshi
Sakshi News home page

IND vs NZ: గంభీర్ చూశావా? తొలి ఓవర్‌లోనే వికెట్‌! వీడియో వైరల్‌

Jan 18 2026 3:40 PM | Updated on Jan 18 2026 3:56 PM

Internet Slams Gautam Gambhir As Arshdeep Singh Strikes In 1st Over On Return

రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి ఓవర్‌లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్ పంపి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్‌ బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్‌దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.

అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో నికోల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో తొలి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌల‌ర్‌ను ఎలా ప‌క్క‌న పెట్టావు? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

మొద‌టి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఎట్ట‌కేల‌కు సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్

టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement